Breaking News

పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ

122 Views

*పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ* రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన కేటీఆర్ కు నియోజకవర్గంలోని సమస్యలపై వినతి పత్రాలు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలతో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపడం జరుగుతుందన్నారు. కేటీఆర్ పర్యటనను జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే ఎంతమంది పోలీసులైన కేటీఆర్ కు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుసద్ది లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి నాయకులు గంట బుచ గౌడ్ గుండా టి రాంరెడ్డి, మానుక నాగరాజ్ బానోతు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్