చేతికి చిక్కిన మరో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
హైదరాబాద్ అక్టోబర్ 17
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈరోజు హైదరాబాదులోని గాంధీభవన్ లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు.. . బిఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని నేరేడిగొండ జడ్పిటిసి అనిల్ జాదవ్ కు బి ఫారం ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి తో ఉన్నట్టు తెలిసింది.
గతంలో కేటీఆర్ పిలిపించి సముదాయించినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.. తన క్యాడర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ లోకి చేరే విషయంపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ని కలిసి పార్టీ చేరికపై మంతనాలు జరిపారు.. . బోథ్ ఎమ్మెల్యే టికెట్ పై కాంగ్రెస్ పార్టీ హామీ లభించడంతో రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం .
