గంభీరావుపేట తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 15: మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుండెపోటు తో మృతిచెందారు. మృతుడు రమేష్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి కి చెందినవారు. స్థానికత జి. ఓ ప్రకారం ఇటీవలే రమేష్ గంభీరావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.రమేష్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, స్థానిక సిఐ మొగిలి,గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ తో పాటు పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.మృతుని కుటుంభాన్ని పోలీసు శాఖ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్,సిఐ మొగిలి అన్నారు.





