Breaking News

సఖి కేంద్రాల సేవలు అమూల్యమైనవి…*

131 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా సఖి సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .*
రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12

బాలికలు,మహిళల సమస్యల పరిష్కారంలో  సఖి కేంద్రాలు అమూల్యమైన సేవలు అందిస్తున్నాయి అని అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని  సఖి కేంద్రాన్ని సందర్శించి మరింత మెరుగైన సేవలకు సూచనలు ఇచ్చారు.

అంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతు..
తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  నిర్వహించబడుతున్న సఖి కేంద్రాలు మహిళల సమస్యల పరిష్కారంలో నిరంతరం పని చేస్తున్నాయని,వారి విధుల నిర్వహణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ అందిస్తున్నామని అన్నారు.

గృహ హింస,వరకట్న వేధింపులు,పనిచేసే చోట వేధింపులు,లైంగిక హింస,ఆడ పిల్లల అమ్మకం,అక్రమ రవాణా వంటి సమస్యలతో వస్తున్న మహిళలకు సలహా, కౌన్సిలింగ్,రక్షణతో పాటుగా వైద్య సేవలు,న్యాయ సహాయం,అందిస్తున్నారని,అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక వసతి కల్పిస్తూ,మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని  కల్పిస్తున్నారని అన్నారు.

మన జిల్లా పరిధిలో సిరిసిల్ల మరియు వేములవాడ సబ్ డివిషన్ పరిధిలో ఇవి పనిచేస్తున్నాయి అని, సఖి కేంద్రాల నిర్వహణ గురించి  మహిళల్లో మరింత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలని అన్నారు.సఖి కేంద్రంలో పొందే సేవలన్ని ఉచితంగా పొందవచ్చునని ,ఇవి 24 గంటలు పనిచేస్తున్నయని అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో 181 కు ఫోన్ చేసే విషయాల గురించి,తమ సమస్యల పరిస్కారం కొరకు ఎలాంటి భయాలు లేకుండా సఖి తమకు అండగా ఉందనే నమ్మకాన్ని మహిళలకు కల్పించాలని అన్నారు.ఇక నుంచి జిల్లా పరిధిలో నాన్ గ్రేవ్ మహిళల  కేసులను మొదట సఖి కేంద్రాల్లో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాతే చివరిగా కేసులు నమోదు చేస్తామని అన్నారు.

జిల్లాలో ఇక ముందు సఖి మరియు పోలీస్ శాఖ సంయుక్తముగా మహిళల్లో చైతన్య కార్య క్రమాలు నిర్వహించి వారికి అండగా ఉంటామని అన్నారు.

జిల్లా పరిధిలో ఎప్పటికప్పుడు కళా బృందాల ద్వారా మారు మూల గ్రామాల్లో సైతం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ,సీ టిం ల ద్వారా పోకిరిలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని,కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.

ఎస్పీ రాహుల్ హెగ్డే వెంట సఖి అడ్మిస్ట్రేటర్ రోజా గారు,లీగల్ అడ్వైజర్ విజయలక్ష్మి కౌన్సెలర్లు,దేవిగా,కళావతి ఇతర సిబ్బంది ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7