సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని అందె గ్రామానికి చెందిన రోడ్ల దుస్థితి గురించి హైదరాబాద్ సచివాలయంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అందె గ్రామానికి సంబంధించిన రోడ్ల దుస్థితి గురించి సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ గడ్డం వివేక్ ని కలసి ఉండే గ్రామ రోడ్ల పరిస్థితిల గురించి తెలియజేయడం జరిగింది. మారుమూల గ్రామమైన అందే నుండి మిరుదొడ్డి వరకు పంచాయతీరాజ్ రోడ్డు, అందే నుండి తిమ్మాపురం వరకు ఆర్ అండ్ బి రోడ్డు, గత 25 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, పూర్తిగా కంకర తేలి గుంతల మాయమయ్యాయి. ఈ రోడ్డు పైన వెళ్లే, విద్యార్థులు రైతులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నారని, అనేక రోడ్డు ప్రమాదాల గురవుతున్నామని తెలియజేశారు. ఈ గ్రామానికి సంబంధించిన రోడ్లను, హెచ్ ఏ ఎం ప్రాజెక్టులో ఫేస్ వన్ చేర్చాలని, అందే గ్రామానికి రోడ్లు వేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందే జేఏసీ కన్వీనర్ వారాల రాజకుమార్, అందె ప్రవీణ్, సోమేశ్వర్ రెడ్డి, రాజు, పరశురాములు, శంకర్, నరసింహులు, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.





