రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14: రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు సోమవారం ముస్తాబాద్, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ముందుగా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 33 లక్షల రూపాయలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, అలాగే 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనంతో పాటు, 15 రకాల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గూడెం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, 30 లక్షల రూపాయలతో ఆధునికీకరించిన మోడల్ అంగన్వాడీ కేంద్రం, 20 లక్షల రూపాయలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన నాలుగు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. తదనంతరం రామలక్ష్మణపల్లి గ్రామంలో 9 లక్షల 40 వేల రూపాయలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గది, 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. చివరగా సిరిసిల్ల పట్టణంలో 1 కోటి 55 లక్షల రూపాయలతో రహదారులు, భవనాల శాఖ విద్యుత్ విభాగం ద్వారా నిర్మించిన కేంద్రీకృత విద్యుత్ దీపాలంకరణను మంత్రి ప్రారంభించారు.
పై కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, ఆర్ & బి ఈఈ కిషన్ రావు, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, జిల్లా విద్యాధికారి డా. రాధా కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ నర్సయ్య, ఎంపీడీఓ రమాదేవి, తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి, స్థానిక సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.





