ఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ…
అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు.
ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా డీజే చప్పులతో ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అయ్యప్ప స్వామికి చక్ర స్నానం నిర్వహించారు. అనంతరం అల్మాస్పూర్ శ్రీను గురుస్వామి, మధు గురుస్వామి, కందుకూరి రవి గురుస్వామి చేతుల మీదగా పంచామృతాలచే అయ్యప్పకు అభిషేకాలు చేశారు. నూతన సంవత్సరం రోజు అయినందున సుమారు చాలామంది భక్తులు హాజరయ్యి అయ్యప్ప పూజల్ని తిలకించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దేవి టిఫిన్స్ యజమాని కందుకూరి నవీన్, రాచర్ల గొల్లపల్లి కి చెందిన గోగురి వెంకటనారాయణ రెడ్డి లు శివ సాయి గార్డెన్ లో అన్న దానం నిర్వహించారు . రాత్రి సమయంలో ముస్తాబాద్ శ్రీశ్రీశ్రీ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి కరకములచే పదినిమిట్టాంబడి పడిపూజను సాయి రమ్య దంపతులు నిర్వహించారు. పడిపూజకు విచ్చేసిన భక్తులకు బొమ్మ కంటి భాస్కర్ జ్యోతి దంపతులు అల్పాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో వంగ గిరిధర్ రెడ్డి, మనోజ్ కుమార్ యాదవ్ కన్యస్వామిలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
