తోగుట
మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్, బండారుపల్లి, తదితర గ్రామాలు శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అభివృద్ధి పనులతోపాటు ఐమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం సైనికులుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రతి గ్రామం ప్రగతి పథంలో తీసుకెళ్లడానిమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నాలుగు గ్రామాల్లో భునిర్వహితులకు బకాయి ఉన్న డబ్బులను వచ్చేలా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినమని త్వరలోనే భూనిర్వాహితులకు చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. అలాగే మట్టిరోడ్లకు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే బీటీ నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దుబ్బాకను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు స్వయంగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు చిక్కుడు చంద్రం, విభీషణ్ రెడ్డి, ప్రవీణ్ వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
