ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 13, జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాట సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే.. ఈనెల జనవరి14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా, జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. కాగా.. జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిందని ఎఫ్. ఎల్. ఎన్. ఓ విఠల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
*ఇక ఇంటర్ కాలేజీలకు కేవలం 3, రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెలలో 14 నుంచి 16 వరకు తిరిగి 17న పునః ప్రారంభం ముస్తాబాద్ మండలంలోని ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్య తెలిపారు. ఈసారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. ఇక సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన వారిలో ఉందని నిరాశ చెందారు.
