- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువజన దినోత్సవం స్వామి వివేకనంద జయంతి నీ పురస్కరించుకొని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 2కె రన్ ను కళాశాల ఆవరణ నుండి మార్కెట్ వద్ద నున్న స్వామి వివేకనంద విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది 2కెరన్ నుప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పిట్ల దాసు గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి వివేకానందుని జీవితం యువతకు ఆదర్శమని అతని అడుగుజాడల్లో నడుచుకోవాలని ప్రిన్సిపాల్ పిలుపుని చ్చారు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పిఓ పాక. ధర్మపురి, కృష్ణ ప్రసాద్ రాజేష్ తదితర అధ్యాపకులు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకట్ నాయక్ మరియు అధ్యాపకులు హై స్కూల్ ప్రధానోపాధ్యాయు లు గంగారాం, బాలయ్య విద్యార్థి ని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
