ప్రాంతీయం

జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను నాణ్యతతో వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలి…

45 Views

జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను నాణ్యతతో వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలి…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7

దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 43 ఇండ్లు మంజూరు కాగా 15 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. మిగతా లబ్ధిదారులతో మాట్లాడి కట్టుకోడానికి సుముఖంగా లేని వాళ్ల నుండి లెటర్ తీసుకుని డిలీట్ చెయ్యాలనీ అధికారులను ఆదేశించారు. పోతుగంటి కనకాలక్ష్మి, కకిపడిగే నాగలక్ష్మి, కొంగరీ ప్రియాంక, గుండెల్లి లావణ్య గృహాలను పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చెయ్యాలని లబ్ధిదారులకు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ లాంటిదని ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మీ మీ యొక్క ఇంటికళనునెరవేర్చుకోవాలని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *