జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ
నియమితులయ్యారు.
ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు వినోద్ కోహ్లి, సెక్రటరీ జనరల్ సభా నాయక్ లు మంగళవారం ప్రకటించారు.
హైదరాబాద్ లోని పటాన్ చెరువు జి యం అర్ గార్డెన్ లో జరిగిన మూడు రోజుల ఐజెయు ప్లీనరీ సమావేశంలో జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సెల్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 రాష్ట్ర లకు చెందిన జర్నలిస్టులు, తెలంగాణకు చెందిన 6వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారు
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా కోనసాగుతున్న సీనియర్ జర్నలిస్ట్ రాచర్ల లక్ష్మీనారాయణ కు జాతీయ కార్యవర్గంలో చోటు లభించడం పట్ల జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు
. కాగా తన నియమాకానికి కృషిచేసిన. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ కు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు
తెలిపారు అలాగే
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తెంజు అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బిజిగిరి శ్రీనివాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు





