తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి అఖిలభారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభారీ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు.
గురువారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని ఒక ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏ రకమైన వ్యూహాలయితే అమలుపరిచామో వాటిని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో కూడా కార్యకర్తలు పనిచేయాలన్నారు.
పార్టీ కిందిస్థాయిలో బలోపేతమైనప్పుడే అధికారంలోకి వస్తుందని అందుకోసం ప్రతి బూతులో కార్యకర్తలు సంవత్సరం పాటు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అందుకు అనుగుణంగా సమిష్టిగా కృషి జరగాలని సునీల్ బన్సల్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇంటింటికి తీసుకు పోవడం
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా బిజెపి ఎదుగుదలకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ప్రతి మండలానికి వెయ్యి మంది కార్యకర్తలు సిద్ధమైతే నియోజకవర్గాల్లో గెలుపు కష్టమేమీ కాదని ఆయన భరోసా ఇచ్చారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజన లో భాగంగా
మెదక్ పార్లమెంట్లో కేంద్ర మంత్రుల పర్యటనలు విస్తృతంగా ఉంటాయన్నారు.
కేంద్ర మంత్రి పర్యటనలో ఆయనను ప్రతి బూత్ కు వెళ్లే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాలని చేసు సూచించారు.
పార్లమెంట్ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున అన్ని అసెంబ్లీలో విజయం సాధించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ సునీల్ బన్సల్ ఉత్తరప్రదేశ్లో పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త తమకి ఇచ్చిన బాధ్యతలని కృత నిశ్చయంతో పూర్తిచేసి పార్టీ బలోపేతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మెదక్ అసెంబ్లీ పాలక్ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మెదక్ అసెంబ్లీని బిజెపి ఖాతాలో వేసే విధంగా తాను బాధ్యత తీసుకుంటానన్నారు.
మెదక్లో ప్రతి బూతులో కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని అక్కడ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి గెలిచే విధంగా వ్యూహాలను రూపొందిస్తున్నామని ప్రతి కార్యకర్త ఇందులో భాగం కావాలని కోరారు
ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ ప్రభరి జయ శ్రీ మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్ సహించార్జిలు సంతోష్, సంగమేశ్వర్,లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు
