* బీసీ బందు మంజూరైన మూడు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల విలువైన ఆర్థిక సహాయం చెక్కుల రూపేణా అందచేసిన..ప్రభుత్వ విప్ ఆరెకపూడి
:శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీసీ, ఎంబీసీల చేతిదారులకు ఆర్థిక సాయం గురువారం మిలాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ లక్ష రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలదేవి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరజా రెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్, కార్పొరేటర్ లు రాగంేందర్ యాదవ్, జగదీశ్వర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు లతో కలిసి మూడు వందల మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ బంధు కులవృత్తులకు పునర్జీవనం చేశానని, కూనరిల్లిన కులవృత్తిదారులకు ఆసరాగా ఉంటుందని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో బీసీ బంధు ఏర్పాటు చేసినట్లు, బీసీ బంధు నిరంతర కార్యక్రమం నిర్వహించడం,బీసీల ఆర్థిక స్వాలంబనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరిగింది అని, ప్రతి పైసా ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి, ఆర్థిక స్వాలంబన పొందండి, దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన, కులవృత్తుల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ బీసీ బందు పథకం ప్రవేశపెట్టారని, ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదివేల రూపాయల రుణం కోసం బ్యాంకుల చుట్టూ పడిగాడ్పులు కాస్తూ, గ్యారంటీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు.నేడు సీఎం కేసీఆర్ నాయకత్వం లేకుండా మొట్టమొదటి సారి కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎలాంటి హామీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తాం. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, లబ్దిదారులు ఉన్నారు.





