సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భవందాపూర్ శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆశాడి ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామికి అభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ హరేరామ నామస్మరణ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విధుమౌళి శాస్త్రి భక్త బృందం ఆధ్వర్యంలో చక్రి భజన కన్నుల పండుగగా నిర్వహించారు.
