విద్య

వెరీ గుడ్….కీప్ ఇట్ అప్ ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుంది

426 Views

కలెక్టర్,అంగన్వాడి సిబ్బందికి మంత్రి కే టి ఆర్ కితాబు కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి  కే టి ఆర్ కితాబునిచ్చారు.మంగళవారం కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆక్టివిటీస్ మెటీరియల్ ని, ప్లే స్కూల్ మెటీరియల్ ని మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా చక్కగా ఉంది.వెరీ గుడ్… కీప్ ఇట్ అప్ అంటూ సంక్షేమ శాఖ అధికారులు,అంగన్వాడీ సిబ్బందికి, ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి మంత్రి అభినందనలు తెలిపారు.కేంద్రం అవరణలో నీ కిచెన్ గార్డెన్ లో పండిస్తున్న క్యాబేజీ టమాట గోంగూర వంకాయ మొక్కజొన్న ఆకుకూరలు మిరప గోరుచిక్కుడు లాంటి కూరగాయల మొక్కల్ని చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7