రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ కమిటీ మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలంలో సుమారు 1800 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని వారి కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఉందన్నారు ఎల్లారెడ్డిపేట ప్రజల ఆకాంక్ష ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని ఉండగా బీసీ బాలుర గురుకుల డిగ్రీ కాలేజీ మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటించడం విడ్డూరమన్నారు డిగ్రీ కాలేజీని టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ప్రైవేట్ కాలేజీ కోసం ప్రభుత్వ కాలేజీ ని అడ్డుకోవడం అన్యాయం అన్నారు ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నట్లయితే ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాలకు సెంటర్ పాయింట్ గా ఉంటుందన్నారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేసేంతవరకు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారుజిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సద్ది లక్ష్మారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బానోతు రాజు నాయక్ నాయకులు దండు శీను సంతోష్ గౌడ్ మామిడి కిషన్ చిన్ని బాబు బుచ్చగౌడ్ కంచర్ల రాజు సిరిసిల్ల సురేష్ శెట్టిపల్లి బాలయ్య బుచ్చి రాములు అన్నవేని రవి కోనేటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.





