బెల్లంపల్లి
బీజేపి గెలుపులో మహిళల పాత్ర కీలకం కావాలి
బెల్లంపల్లి బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని రాబోవు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని, మహిళలు చైతన్య వంతులు అవుతున్నారని, ఒక కొత్త నాయకత్వం కొరకు ఆలోచన చేస్తున్నారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీజేపి అభ్యర్థి అమురాజుల శ్రీదేవి అన్నారు.
చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారి జీవితాలకు బీజేపి భరోసా కల్పించిందన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని 7వ వార్డు సుభాష్ నగర్ కు సంబంధించిన గీస రాములు,అనపర్తి సదయ్య, గీస నవీన్, గీస ప్రవీణ్, టి. రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ మొగిలి సులోచన తో పాటు 150 మంది మహిళలు, యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీదేవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోవు ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో మహిళనైన నన్ను ప్రజలందరూ గెలిపించాలని, గతంలో ఎమ్మెల్యేగా నిజాయితీగా పనిచేసిన అనుభవం నాకు ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి బెల్లంపల్లి జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పుల్లగం తిరుపతి, బిజెపి బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి గాండ్ల మహేష్, ముడేడ్ల మల్లేష్ స్థానిక మహిళలు పాల్గొన్నారు.
