రాజకీయం

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా దొమ్మాటి

77 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను నియమించినందుకు బుధవారం దొమ్మాటి నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించడం జరిగిందన్నారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట మండలాలకు ఇన్చార్జిగా బ్లాక్ అధ్యక్షునిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు.

తనపై నమ్మకం ఉంచి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. 3 మండలాలలో తన శక్తి మేరకు సేవ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *