Breaking News

అక్కపల్లి లో ఘణంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం

151 Views

పెద్దమ్మకు పట్నాలు ,బోనాలు సమర్పించుకున్నారు, పత్యేకపూజలు ,ఓగ్గుకథ ప్రదర్శన

చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 :

ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆద్వర్యంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ,
ఈ సందర్భంగా పెద్దమ్మ ఆలయం ఎదుట పట్నాలు వేశారు , ముదిరాజ్ లు వారి వారి ఇంటి నుంచి మహిళలు ఇంటికో భోనం ఎత్తారు , డప్పుచప్పుల్లతో పెద్దమ్మ ఆలయం వరకు ఊరేగింపు గా వెళ్ళారు ,అనంతరం ఓగ్గుకథ కళాకారులు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం గురించి వేషాధరణ తో ఇచ్చిన ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది,
పెద్దమ్మ దేవాలయం ఎదుట దాయితమ్ముళ్ళు విన్యాసాలు మేక గావును ప్రదర్శించారు ,
పత్యేకపూజలు చేశారు అనంతరం పెద్దమ్మ పెద్దిరాజుల ను ముదిరాజ్ కులస్థులను, గ్రామాన్ని గ్రామ ప్రజలను చల్లాగా చూడాలని కోరుకుంటున్నట్లు ఆ సంఘం అద్యక్షులు జిన్న నాంపెల్లి తెలిపారు ,అనంతరం భక్త జనానికి తీర్థప్రసాదాలు వితరణ చేశారు ,
ఈ కళ్యానోత్సావాన్నీ తిలకించడానికి అక్కపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు ,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7