ప్రాంతీయం

అఖిల రాజ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.

24 Views

ఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిల రాజ్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించడం అభినందనీయమని ముబారస్ పూర్ సర్పంచ్ విజయ స్వామి పేర్కొన్నారు. ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కురిందల భూమయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ వెంటనే ఫౌండేషన్ మండల అధ్యక్షులు కోరే శేఖర్ ద్వారా బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం సమాకూర్చారు. మండల కమిటీ బాధిత కుటుంబానికి ముబారస్ పూర్ సర్పంచ్ విజయ స్వామి, ఉప సర్పంచ్ రాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ విజయ స్వామి మాట్లాడుతూ ఆపద సమయంలో ఫౌండేషన్ తోడునీడగా నిలుస్తుండడం గొప్ప విషయం అన్నారు. మానవత్వం అంతరించి పోతున్న తరుణంలో సాటి మనుషులకు సేవ చేయాలనే అఖిల రాజ్ ఫౌండేషన్ ఆలోచన ఎందరికో స్ఫూర్తి అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లక్ష్మణ్, ఫౌండేషన్ మండల సెక్రటరీ కర్ణాకర్, దార స్వామి, ఫౌండేషన్ సభ్యులు విజయ్, నర్సిములు, యాదగిరి, షాదుల్ల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *