మంచిర్యాల జిల్లా.
చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన డాక్టర్ శరత్ బాబు.
జనవరి 10 న జరిగే డిజెఎఫ్ మహ సభను విజయవంతం చేయండి.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మరియు యూట్యూబ్ లలో పని చేసే వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినదే డిజెఫ్.
మంచిర్యాల జిల్లా నుండి వందలాదిగా జర్నలిస్టులు కదిలి రావాలని పిలుపునిచ్చిన డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రయ్య.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని డాక్టర్ జానపాటి శరత్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు .ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా లో పనిచేస్తున్న యూట్యూబ్ ,ప్రింట్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా లో నిస్పార్ధంగా నిస్పక్షపాతంగా నయా పైసా జీతభత్యాలు లేకుండా ప్రజా శ్రేయస్సు పరమవదిగా వర్కింగ్ జర్నలిస్టులుగా పని చేస్తున్న మిత్రులందరికీ, మన జర్నలిస్టుల హక్కులకై ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలకై ,నేడు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ , జర్నలిస్టుల గొంతుకగా జర్నలిస్టుల తరఫున కొట్లాడే ఉద్యమ కెరటమే డీజే ఎఫ్ అన్నారు. జర్నలిస్టుల ఆత్మ సాక్షిగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించే విలేకరులకు ప్రభుత్వం నుండి రావలసిన, ప్రతి ఒక్క విలేఖరికి రెండు గుంటల ఇంటి స్థలం, హెల్త్ కార్డు ,విలేకరుల పిల్లలకు కార్పొరేట్ కళాశాలలో స్కూళ్లలో ఉచిత విద్య అందించాలనె లక్ష్యంతో ముందుకెళుతున్న విలేకరుల యుద్ధనౌక ,తను పురుడు పోసుకున్న జిల్లా కరీంనగర్ లోనే ఈనెల 10వ తారీఖున నిర్వహించుకునే డి జె ఎఫ్ సభకు వందలాదిగా మన జిల్లా నుండి జర్నలిస్టు మిత్రులు కదిలి రావాలని కోరడమైనది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మోకనపల్లి భద్రయ్య ,జనరల్ సెక్రెటరీ బర్ల తిరుపతి ,వర్కింగ్ జర్నలిస్టులు కుషనపెళ్లి సతీష్, కుమార్ , నగేష్ , ట్రెజరీ చొప్పదండి జనార్ధన్, మంచిర్యాల జిల్రా సెక్రటరి జిల్లపెల్లి రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





