సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మోచి సంఘం కార్యవర్గం రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి ఆదివారం రోజున బాల శంకర కృష్ణ పిలుపు నిచ్చారు
15 వ శతాబ్దపు సామజిక సంఘసంస్కర్త, కుల,మతాలకు అతీతంగా సమానత్వ భోధనలను ఆధ్యాత్మిక కోణంలో చెప్పిన కరుణామయుడు. సమతా మమత, జ్ఞానాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలను తిరిగి సమాజంలో ప్రభవించడానికి నిరంతరం కృషి చేసిన మానవతా మూర్తి, పురాణ, ఇతిహాసాల పేరుతో బ్రాహ్మణీయ మనువాదాన్ని తన కవితలు, పంక్తుల ద్వారా చీల్చి చెండాడి దేవుళ్ళకు మనుషులందరూ ఒక్కటే అని, మనుషులు హేతు బద్దంగా ఆలోచించి ఆధునికత వైపు ప్రయాణించాలని సమాజంలో అజ్ఞానాన్ని వణికించిన విప్లవ మూర్తి ఐన *శ్రీ సంత్ గురు రావిదాస్ గారి 645 వ జయంతి వేడుకలను* అన్ని పట్టణా, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో *తేదీ 16-02-22 బుధవారం* రోజున ఘనంగా నిర్వహించాలని *రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం (రి.నం 2098/97 ) పిలుపునిస్తుంది.
