Breaking News

ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది – బి జె పి

5 Views

మంచిర్యాల జిల్లా.

ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ.

1975 లో అప్పటి ప్రధాన మంత్రి  ఇందిరాగాంధీ  విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా ఆవిర్భవిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు యెండల లక్ష్మి నారాయణ, సీనియర్ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి మరియు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ అప్పటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ 1975 జూన్ 25 న దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులను జైల్లో బంధించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కానీ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, ముల్కల్ల మల్ల రెడ్డి, కొయ్యల ఎమాజీ, మున్నా రాజా సిసోడియా, దుర్గం అశోక్, బియ్యాల సతీష్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణ మూర్తి, మోటపలుకుల తిరుపతి, పానుగంటి మధు, మోటపలుకుల గురువయ్య, గాజుల ముఖేష్ గౌడ్, మల్యాల శ్రీనివాస్, గుండా ప్రభాకర్, గాదె శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, మాదవరపు వెంకట రమణ రావు, రఘునందన్, మోతె సుజాత, బొప్పు కిషన్, సుధాకర్ రావు, కర్రె లచ్చన్న, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, బందెల రవి గౌడ్, తుమ్మ శ్రీపాల్, ఠాకూర్ ధన్ సింగ్, మంత్రి రామన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్