ప్రాంతీయం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో…

63 Views

ముస్తాబాద్ ఫిబ్రవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శించి హాస్టల్లో ఉండి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు తీసుకోవాల్సిందిగా కోరారని అంతే కాకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పలు సూచనలు చేశారని ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్ రావు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయం సాయంత్రం విద్యార్థులకు బోధించే వాతావరణంపట్ల ఆసక్తి ఏకాగ్రతను పెంచుతాయన్నారు. జరిగే స్పెషల్ క్లాసులకు విద్యార్థుల హాజరుశాతాన్ని గమనించి పరీక్షల నిర్వహణ మార్కులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాల పరిశుభ్రత మధ్యాహ్న భోజనాలను డిఈఓ పరిశీలించారని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *