ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, బొప్పాపూర్, రాచర్ల సహకార స్వర్ణకార సంఘానికి సంఘ సభ్యుడు రాచర్ల గొల్లపల్లి వాస్తవ్యుడు న్యాలపాల్లి శ్రీనివాస్ చారి 40 కుర్చీలను వితరణ చేశారు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ స్వర్ణకార సంఘానికి అహర్నిశలు పాటుపడతానని కులంతోటే బలమని స్వర్ణకార కులానికి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయం చేస్తానని బీద ధనిక సంబంధం లేకుండా స్వర్ణకారులందరం ఒకటేనని అన్నారు నా వంతు చిరు సహాయంగా 40 కుర్చీలు ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మండోజు రాజేశం చారి ఉపాధ్యక్షుడు వంగాల నరేందర్ చారి ప్రధాన కార్యదర్శి వంగాల సురేందర్ చారి కోశాధికారి శ్రీరామోజు శ్రీనివాస్ చారి మరియు రాచర్ల స్వర్ణకార సహకార సంఘ సభ్యులు పాల్గొని న్యలపల్లి శ్రీనివాస్ చారిని శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.
