ముస్తాబాద్ (ప్రతినిధి) కస్తూరి వెంకట్ రెడ్డి, డిసెంబర్ 30, బీసీ విద్యార్థి సంఘం బాలికల హాస్టల్ ఇన్చార్జిగా కొమటం సౌమ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ప్రకటించడం. ఈసందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ హాస్టల్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పలు సూచనలు తెలియజేసి బీసీ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, విద్యార్థి నాయకురాలు పంగ అక్షిత, గౌరీ, దీక్ష, వల్లంపట్ల శ్రీజ, కోలాపురి అవనిక, దండగుల తేజ, బంటు, వర్షా తదితరులు పాల్గొన్నారు.
