*రామగుండం పోలీస్ కమిషనరేట్
చనిపోయిన హోం గార్డ్‌కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ బి.శ్రీనివాస్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి గోదావరిఖని శ్రీనగర్ కాలనీ (వినాయక్ నగర్)లోని ఆయన నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… 1996 సంవత్సరంలో హోంగార్డ్‌గా ఎంపికైన బి.శ్రీనివాస్ గత 30 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారని తెలిపారు.ఆయన ఆకస్మిక మరణం పోలీస్ శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి తీరని లోటని పేర్కొన్నారు.ఆయన సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామని, కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని డీసీపీ తెలిపారు. పోలీస్ శాఖ తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి,రామగుండం సీఐ కృష్ణ,హోంగార్డ్ ఆర్‌ఐ పెద్దన్న,ఎంటీవో మల్లేశం తదితర సిబ్బంది పాల్గొన్నారు.





