కొమురం భీం జిల్లా.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.
*వైద్య విద్యార్థులకు. వసతులు కల్పించాలి – బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్.
నేడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని బిజెపి బృందం పరిశీలించి వైద్య విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తున్న కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి. జిల్లా ఉపాధ్యక్షులు కాండ్రే విశాల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం లోని ప్రధాన ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రెబ్బెర మండలానికి చెందిన సతీష్ మహాత్మ జ్వరంతో నిన్న హాస్పిటల్లో చూయించుకుని బ్లడ్ టెస్టులకు ఇచ్చారని ఈరోజు కూడా హాస్పిటల్కు వచ్చిన బ్లడ్ టెస్ట్ మిషన్ కరాబ్ అయిందని రిపోర్టులు రాక వైద్యం అందించకుండానే ఆరు బయటనే కూర్చోబెట్టారు జిల్లా ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు ఐసీయూ. కుట్లు వేయడానికి సూదులు, కత్తెర్లు, దారాలు, ఇతర పరికరాలు లేవు. జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసు కెళ్తే ఈ ఆసుపత్రి కేవలం మంచిర్యాలకు రిఫర్ చేయడానికి మాత్రమే ఉందని, ఇదిలా ఉంటే వైద్య విద్యార్థులకు ఎలా ప్రాక్టికల్స్ సాగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాము విద్యార్థులు అసౌకర్యాలతో సతమతమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు మౌలిక వసతులు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేకపోవడంతో ఈ జిల్లాకు శాపంలా మారింది, వైద్య విద్య ఎలా అభ్యసిస్తారని వారందరూ నిరసన తెలుపుతున్నారని. వైద్య విద్యార్థులే జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టిన తీరు పరిస్థితి తీవ్రతను చెబుతోందని జిల్లాలోని ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏ విధంగా ఉంటాయాని. ప్రధాన ఆసుపత్రిలో గైనకాలజిస్ట్. చర్మవ్యాధుల డాక్టర్. నేత్ర వైద్య నిపుణులను నియమించాలని. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తయినా.. సరిపడా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక బోధన, ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారని వసతి గృహ గుత్తేదారు ద్వారా విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.3,700 వరకు చెల్లిస్తున్నా, నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ఒక్కోసారి అన్నంలో పురుగులు వసున్నాయని నాసిరకం సరకులు సరఫరా చేస్తున్నారని. వెంటనే జిల్లా ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య విద్యార్థుల కు సరైన ఫ్యాకల్టీని వసతులను కల్పించాలి. వెంటనే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని బిజెపి డిమాండ్ చేస్తుందని అన్నారు లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా దళిత మోర్చా జిల్లా నాయకులు మాటూరి జయరాజ్. నాయకులు చేపూరి నవీన్ గౌడ్. వెంకటేశ్వర్లు. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.





