గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామనికి చాకలి భాగ్యమ్మ కి 24000.మంద రాజు 25000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరు కాబడిన చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు.రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయిందని అన్నారు.కొత్తగా మెడికల్ కాలేజీలతో అదనంగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరిగాయని అన్నారు.6శాతం నుంచి 10శాతానికి ఎస్టీ రిజర్వేషన్ కూడా పెరిగిందని అన్నారు. దీంతో రాష్ట్రములో విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరిగాయని అన్నారు. డాక్టర్ కావాలనే కలను తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది అన్నారు.అదేవిధంగా అప్పుడే బిడ్డకు కేసీఆర్ కిట్ పథకం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకున్నదని ఇప్పుడు న్యూటిషన్ కిట్ ప్రారంభించుకున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనేక మౌలిక సదుపాయాలు కలిపిస్తున్నారని అందులో భాగంగా కిడ్నీ పేషంట్స్ కి డయాలసిస్ , గర్భిణీ స్త్రీలకు టిఫ స్కాన్, వంటివి ప్రవేశపెట్టడం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేసుకోవడం తప్పిందని ఖర్చుల భారం కూడా పోయిందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో ఎందరో నిరుపేదలకు వారికి చికిత్స నిమిత్తం డబ్బులు మంజూరు అవుతున్న విషయాన్ని వారు వెలిబుచ్చారు. మంత్రి హరీశ్ రావు గారు సమర్థవంతంగా రేయింబవళ్లు రాష్ట్రం మొత్తం తిరుగుతూ పారదర్శకంగా ప్రజలకు వైద్యం అందేలా సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తున్నారన్నారు..తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు..ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని ప్రజలు సంతోషంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబందు పథకాన్ని కొత్తగా పాస్బుక్స్ వచ్చిన రైతులందరు ఈ నెల 31 వ తారీఖు లోపు స్థానిక క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబందు సమీతి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్,యూత్ నాయకులు వడ్ల నరేష్, తోట సంతోష్, కుంట కిష్టారెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.




