Breaking News కథనాలు

భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”

132 Views

తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు.
ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రపంచభాషనీ,సుమారు 20కోట్లమంది మాట్లాడుతున్నారనీ, తెలుగు భాషను రక్షిచడంలో మనందరికీ బాధ్యత ఉందన్నారు. ఇతరభాషలను గౌరవిస్తూనే మాతృభాష తెలుగును కాపాడటంలోనూ వ్యాప్తి చేయడంలో రచయితల, మేధావుల కృషి ఉందన్నారు.బాల్యంనుండే బాలసాహిత్యంద్వారా మాతృభాషను రంగరించి పోయాలనీ, ప్రభుత్వం తెలుగులో లేకుండా ఏ పత్రాన్ని ఇంగ్లీషులో ముద్రించరాదని, తెలుగుభాషా చట్టాలను అమలు చేయాలని, తెలుగుమాధ్యమంలో చదివినవారికి ఉద్యోగాలల్లో రిజర్వేషన్ కల్పించాలని పరశురాం తెలిపారు. సదస్సులో తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి చెన్నయ్యలు , అతిథులుగా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడిహరికృష్ణ , తెలంగాణ అధికారభాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి,ఆచార్య మసన చెన్నప్ప , బైరి రాజశేఖర్, దాసోజు పద్మ, బషీర్, జ్యోతి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రశంసాపత్రం, బుక్స్ బహుకరించి సత్కరించారని పర్శరాములు తెల్పారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్