ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వర్స ఆనందం అనే రైతు మూడు రోజుల క్రితం గ్రామంలోని తన వ్యవసాయ పొలం సమీపంలో పురుగుల మందు సేవించాడు.
రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళి చూడగా అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు.
ప్రక్కనే గడ్డి మందు బాటిల్ లు పడి ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్న రైతు ఆనందం గడ్డి మందు సేవించినట్లు గుర్తించి వెంటనే ఎల్లారెడ్డిపేట లోని అశ్విని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారు ఝామున మృతి చెందాడు.
రైతు ఆనందం మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఈ సంఘటన బొప్పాపూర్ లో విషాదాన్ని నింపింది.
