ఆర్థిక, రాజకీయ, సమానత్వంలో దళిత,బహుజనులు వెనకబాటుకు కారణమైన మనుస్మృతి ని గజ్వేల్ మండల్ అనంతరావుపల్లిలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆద్వర్యంలో దగ్ధం చేయటం జరిగింది.ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో వర్ణవ్యవస్థను సుప్రతిష్టతం చేసి,ఎన్నో అమానీయ ఆచారాలను భారతీయ సమాజం మీద రుద్దిన మనుస్మృతి ని అధర్మశాస్త్రం దానిపట్ల నిరసన భావంతోనే 1927 డిసెంబరు 25 వ తేదిన నేటి ముంబాయి నగరానా బౌద్దభిక్షుల సమక్షంలో బహిరంగంగా తగులబెట్టారు.అప్పటినుంచి దళితులు,నవ్య బౌద్దులు,అంబేడ్కరైట్లు ఆ రొజును మనుస్మృతి దహన్ దివాస్ పాటిస్తూ అదే రొజున మనుస్మృతి ప్రతిని తగలబెడుతూ ఇస్తున్నారు.ఈ శాస్త్రం లో స్త్రీల కు సమానత్వం లేదు,అంటరానితనం, రెండు గ్లాసుల విదానం,ఆలయ ప్రవేశ నిరాకరణ ఇట్లా సమాజంలోని ప్రతి సాంఘీక సమస్యకు కారణమైన మనుధర్మ శాస్త్రం కనుక దినిని మనుషుల మస్థీష్కంలనుండి తొలగించుకొని కంప్యూటర్ యుగంలో పొటి ప్రపంచంలో రాటుదెలలని యువతకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో బైరం స్వామి, కొప్పు రవి,గద్ద స్వామి,గద్ద నర్సింలు, పెర్క కిష్టయ్య,చిన్న,గద్ద స్వామి తదితరులు పాల్గొన్నారు.