ప్రాంతీయం

లక్షెట్టీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు

26 Views

లక్షెట్టీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల నియోజకవర్గం.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పలు విద్యార్థులు నృత్యం చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  బహుమతులు అందజేసి అభినందించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల విషయంలో తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు.అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో మరియు గజమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కళాశాల ప్రిన్సిపాల్ లక్మణ్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, మంచిర్యాల జిల్లా ఆర్టిఏ నెంబర్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్పరంచులు, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *