ప్రాంతీయం

మద్యం మత్తులో డ్రైవింగ్.. శిక్ష గా ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు

37 Views

*మద్యం మత్తులో డ్రైవింగ్.. శిక్ష గా ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు*

రామగుండం కమిషనరేట్.

మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినా కాచాపూర్ గ్రామానికి చెందిన తీగల అజయ్ , చందపల్లి కి చెందిన పర్శ తిరుపతి, చిన్నకల్వల కు చెందిన మెరుగు సతీష్ మరియు ఖిలవనపర్తి కి చెందిన తలారి రాహుల్ అని నలుగురు వ్యక్తులను గౌరవ కోర్ట్ ముందు హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల గారు రూ.500/- జరిమానా విధించడంతో పాటు, 2 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో విచారణ ఎదుర్కొన్న మందుబాబులకు తీర్పుకు అనుగుణంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో కమాన్, బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వర్తించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *