సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళ వారం బీఆర్ఎస్ నాయకుడు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి స్వగృహంలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి విష్ణువర్ధన్ రెడ్డికి శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు అని బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తు సమాజానికి మేలు చేసే విధంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొగ్గుల చందు, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అద్యక్షులు NC సంతోష్ గుప్త,నాయకులు,ప్రవీణ్,సంపత్,వెంకటేశ్,సాయి,నరేందర్ రెడ్డి, బాలేష్, శ్రీనివాస్, శాంసుందర్ తదితరులు పాల్గొన్నారు




