గజ్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్ నియమితులయ్యారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ ను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ మండలాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే రఘునందన్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.