రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన దెవారెడ్డి,ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్ పాటి దేవయ్య,తీగల ప్రకాష్ గౌడ్,కొండ దేవయ్య గౌడ్,పెంజర్ల నారాయణ యాదవ్,మద్దివెని దేవయ్య ఉన్నారు.చిదుగు గోవర్ధన్ గౌడ్ కు లాస్య తల్లిదండ్రులు ధన్యవాదాలుతెలిపారు.
