ప్రాంతీయం

మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ 

2 Views

మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,( తెలుగు న్యూస్ 24/7)

మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఓపి రిజిస్టర్ వెరిఫై చేస్తూ ఓపి చాలా మంది చూశారని అభినందించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే మెడికల్ ఆఫీసర్ నుండి సిబ్బంది వరకు ఎవరు కూడా సెలవు తీసుకోకూడదని ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అందించిన సెలవులు మాత్రం ప్రతి సిబ్బంది వినియోగించుకోవాలని లేనియెడల జీతంలో కోత విధించాలని మెడికల్ ఆఫీసర్ ని ఆదేశించారు. ఫార్మాసి గదిలో మందులను తనికి చేశారు. ఆయా సీజన్ లకు సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని కాలం చెల్లిన మందులు వాడకూడదని ఫార్మాసిస్ట్ ను ఆదేశించారు. ల్యాబ్ గదిని పరిశీలిస్తూ పరీక్షల వివరాలు ఆరా తీశారు. పరీక్షలు నిర్వహించడానికి అన్ని పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ల్యాబ్ టెక్నీషియన్ ను ఆదేశించారు. పి ఎచ్ సి వచ్చే రోజులకు మెరుగైన వైద్యం అందించాలని గర్భిణీ మహిళలను నేల వారిగా మానిటర్ చేసి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బందిని ఆదేశించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *