స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు
ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 12 :
ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగనున్నాయి ,
ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయి, పోటి పడుతున్న అభ్యర్థులు ఏవరికి వారుగా రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన ఓటర్లను స్వయంగా కలిసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు,
ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష స్థానానికి ఎల్లారెడ్డిపేట కు చెందిన మాజీ ఎంపిటిసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు నేవూరి రవీందర్ రెడ్డి పోటీపడుతుండగా , ఎల్లారెడ్డిపేట కు చెందిన బిజెపి నాయకులు గుండాడి వెంకట్ రెడ్డి కూడా పోటిపడుతున్నారు ,
అదే విధంగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ పాశం దేవా రెడ్డి కూడా పోటీ పడుతున్నారు ,
ఎల్లారెడ్డిపేట మండలంలో రెడ్డి సంక్షేమ సంఘానికి మొత్తం 1400 ఓట్లు ఉన్నాయి,
రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు నామినేషన్ వేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు,
గతంలో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో నేవూరి రవీందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు టాస్ వేయడంతో ఓటమిపాలయ్యారు, దీంతో బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంగ అంజి రెడ్డి అద్యక్ష పీఠాన్ని దక్కించుకోగల్గారు ,
గతంలో తనకు అధ్యక్ష పదవి చేజారినందున ఈసారి ఏ విధంగానైనా అద్యక్ష పదవిని దక్కించుకోవడానికి రవీందర్ రెడ్డి పావులు కదుపుతున్నాడు,
రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన ఓటర్లను స్వయంగా కలుసుకుని తమ మద్దతును కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తన్నాడు, ఈ సారైనా తనను గట్టెక్కించాలనీ రవీందర్ రెడ్డి ఇప్పటికే మండలంలో ఓక రౌండ్ ప్రచారాన్ని చేసినట్టు తెలిసింది ,
పాషం దేవ రెడ్డి కూడా అద్యక్ష పదవిని కైవసం చేసుకువాలనే గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం





