దౌల్తాబాద్: దౌల్తాబాద్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉమ్మడి నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి మరణించగా విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సుజాత రామలింగారెడ్డి, చిందం రాజ్ కుమార్ లు పరామర్శించారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుండి పడి గాయపడిన సపాయి కార్మికురాలు రామవ్వను పరామర్శించారు. వారి వెంట నాయకులు రైతన్న, కిష్టారెడ్డి, గోవిందరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు..




