ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
చెన్నూరు నియోజకవర్గం, భీమవరం మండలం.
నేడు భీమారం మండల కేంద్రంలో వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మ గాంధీ 155వ జయంతినీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
దేశం కోసం అహింస , శాంతియుత పోరాటమే మార్గంగా మన హక్కులను పొందేలా చేసిన గాంధీకీ ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భీమారం మండల కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ , సూరం శ్యామ్ సుందర్ రెడ్డి , కోట రమేష్ , జంగిలి గట్టయ్య , పందుల శ్రీకాంత్ , దబ్బేట శ్రీకాంత్, కొమ్ము ప్రవీణ్ , మనువోతుల రాజు తదితరులు పాల్గొన్నారు .





