తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా:
ఆగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఐడీ ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు,ఏజెంట్ల వద్ద ఉన్న అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా 25-11-2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రత్యేక కేంద్రాల్లో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
మంచిర్యాల కేంద్రం వివరాలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రాంత బాధితుల కోసం నస్పూర్ పోలీస్ స్టేషన్,మంచిర్యాల జిల్లాలో ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రం పరిధిలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,నిర్మల్ జిల్లాలకు చెందిన బాధితులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
*సంప్రదించాల్సిన అధికారి:*
*వై. కృష్ణారెడ్డి, IOP, CCS*
*ఫోన్: 8179163403*
బాధితులు ధృవీకరణకు తీసుకురావాల్సిన పత్రాలు
డిపాజిటర్ జీవించి ఉన్న సందర్భంలో:
1. అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ / నగదు రసీదు.
2. బాండ్‌పై సంతకం చేసిన కలర్ జిరాక్స్ ప్రతిని.
3. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులు.
4. బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ ప్రతి.
5. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటో.
6. డిపాజిటర్ మొబైల్ నంబర్ మరియు బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
7. ఏజెంట్ పేరు, మొబైల్ నంబర్ (తెలిస్తే).
డిపాజిటర్ మరణించిన సందర్భంలో:
నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రం,ఆధార్,పాన్, బ్యాంకు ఖాతా వివరాలు,కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి.
ముఖ్యమైన సూచనలు
– అసలు బాండ్‌ను కేవలం ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి. అసలు బాండ్‌ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు.
– బాండ్‌కు సంబంధించిన కలర్ జిరాక్స్ ప్రతిపై సంబంధిత డిపాజిటర్ / నామినీ / చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి.
– బ్యాంకు ఖాతా వివరాలు, ఖాతాదారుని పేరు,ఖాతా సంఖ్య,IFSC కోడ్ స్పష్టంగా కనిపించేలా చూడాలి.
– డిపాజిటర్ లేదా కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి.
– సమర్పించిన పత్రాలకు రసీదు అందజేయబడుతుంది.
– బాండ్ల ధృవీకరణకు సంబంధించి మండలాల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మాత్రమే సంబంధిత కేంద్రాలకు హాజరుకావాలి.
ధృవీకరణ కేంద్రం పనివేళలు
ధృవీకరణ ప్రక్రియ పని దినాల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది.
ఆగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, నామినీలు, చట్టబద్ధ వారసులు మరియు ఏజెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అవసరమైన అన్ని పత్రాలతో సంబంధిత ధృవీకరణ కేంద్రానికి హాజరుకావాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సూచించింది.
మంచిర్యాల జిల్లా పరిధిలోని బాధితులకు మండలాల వారీ షెడ్యూల్
*28-01-2027: బెల్లంపల్లి మండలం – 250 మంది.*
*29-01-2027: బెల్లంపల్లి మండలం – 197 మంది; భీమారం మండలం – 53 మంది.*
*30-01-2027: భీమారం మండలం – 199 మంది; భీమిని మండలం – 51 మంది.*
*01-02-2027: భీమిని మండలం – 250 మంది.*
*02-02-2027: భీమిని మండలం – 33 మంది; చెన్నూరు మండలం – 217 మంది.*
*03-02-2027: చెన్నూరు మండలం – 154 మంది; దండేపల్లి మండలం – 96 మంది.*
*04-02-2027: దండేపల్లి మండలం – 250 మంది.*
*05-02-2027: దండేపల్లి మండలం – 36 మంది; హాజీపూర్ మండలం – 214 మంది.*
*06-02-2027: హాజీపూర్ మండలం – 33 మంది; జైపూర్ మండలం – 217 మంది.*
*08-02-2027: జైపూర్ మండలం – 208 మంది; జన్నారం మండలం – 42 మంది.*
*09-02-2027: జన్నారం మండలం – 250 మంది.*
*10-02-2027: జన్నారం మండలం – 66 మంది;* *కన్నెపల్లి మండలం – 184 మంది.*
*11-02-2027: కన్నెపల్లి మండలం – 202 మంది; కాసిపేట మండలం – 48 మంది.*
*12-02-2027: కాసిపేట మండలం – 250 మంది.*
*15-02-2027: కాసిపేట మండలం – 41 మంది; కోటపల్లి మండలం – 209 మంది.*
*16-02-2027: కోటపల్లి మండలం – 46 మంది; లక్షెట్టిపేట మండలం – 204 మంది.*
*17-02-2027: లక్షెట్టిపేట మండలం – 104 మంది; మంచిర్యాల మండలం – 146 మంది.*
*18-02-2027: మంచిర్యాల మండలం – 204 మంది; మందమర్రి మండలం – 46 మంది.*
*19-02-2027: మందమర్రి మండలం – 250 మంది.*
*20-02-2027: మందమర్రి మండలం – 250 మంది.*
*22-02-2027: మందమర్రి మండలం – 250 మంది.*
*23-02-2027: మందమర్రి మండలం – 7 మంది; నస్పూర్ మండలం – 243 మంది.*
*24-02-2027: నస్పూర్ మండలం – 154 మంది; నెన్నెల మండలం – 96 మంది.*
*25-02-2027: నెన్నెల మండలం – 157 మంది; తాండూర్ మండలం – 93 మంది.*
*26-02-2027: తాండూర్ మండలం – 196 మంది; వేమనపల్లి మండలం – 54 మంది.*
*27-02-2027: వేమనపల్లి మండలం – 223 మంది; ఖానాపూర్ మండలం – 27 మంది.*
*01-03-2027: ఖానాపూర్ మండలం – 222 మంది; లోకేశ్వరం మండలం – 28 మంది.*
బాధితులకు ముఖ్య గమనిక
ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించిన తేదీలు మరియు మండలాల వారీ షెడ్యూల్‌ను సంబంధిత ధృవీకరణ కేంద్రాల అధికారుల వద్ద ముందుగా నిర్ధారించుకోవాలని బాధితులకు సూచించారు.
నిర్ణీత తేదీన,నిర్ణీత సంఖ్యకు అనుగుణంగా సంబంధిత మండలాల బాధితులు నస్పూర్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ కోరింది.





