టెక్స్ టైల్ పార్క్ లో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి కార్మికులకు కూలి పెంచకుంటే సమ్మెలోకి వెళతాంసిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన టెక్స్ టైల్ పార్క్ లో జరిగిందిఈ సమావేశానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి గత సంవత్సరం మాదిరిగా కాకుండా పిక్కులను పెంచడం వలన కార్మికులకు కూలి గిట్టుబాటు కాక సరైన వేతనాలు రావడం లేదని ప్రైవేటు వస్త్రానికి వస్తున్న వేతనాలు మాత్రమే రావడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు ప్రభుత్వమే కూలీ నిర్ణయించకపోవడం వలన కూలి గిట్టుబాటు కాక కార్మికులు నష్టపోవడం జరుగుతుందని కూలి పెంచాలని గత వారం రోజుల క్రితమే యజమానుల సంఘానికి వినతిపత్రం అందించిన కూడా ఇప్పటివరకు వారి నుండి ఎలాంటి స్పందన లేనందున ఈనెల చివరి వరకు యజమానులు కూలి పెంచాలని లేకుంటే జూలై 1వ. తేదీ నుండి కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు కార్మికులు సమ్మెలోకి వెళ్ళకముందే ఒక మీటరుకు 4-50 పై!! కూలీ పెంచాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అక్కల శ్రీనివాస్ , జెల్ల సదానందం , అడేపు శుభ శేఖర్ , మహేష్ , రాజమల్లు , కనుకయ్య , రంగయ్య , అంబదాస్ , శ్రీకాంత్ , వేణు , మహేష్ , రవి , నాగరాజు , కనకయ్య , సంతోష్ , శ్రీనివాస్ , అశోక్ , రమేష్ , కిషన్ , నరేష్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
