ప్రాంతీయం

ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

8 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని అమరవాదిలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని 18 నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న వ్యక్తి బీమా వ్యక్తిగా ప్రతిపాదించబడతారని, భీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేసి, నామిని వివరాలను తెలియపరిచి స్వయంగా అందించాలని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని, దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నామినీ ఎంపిక విషయంలో సంబంధిత లబ్ధిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *