ప్రాంతీయం

పోలీస్ వాహనాల పనితీరుపై సీపీ పరిశీలన.. వాహనాల్లో రైట్ గేర్ తప్పనిసరిగా ఉండాలి* పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల పోలీస్ వాహనాలను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

5 Views

*పోలీస్ వాహనాల పనితీరుపై సీపీ పరిశీలన, వాహనాల్లో రైట్ గేర్ తప్పనిసరిగా ఉండాలి* పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల పోలీస్ వాహనాలను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ వాహనాల పనితీరు, నిర్వహణపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. వాహనాలను స్వయంగా తనిఖీ చేసి,వాటి ప్రస్తుత పరిస్థితి,పనితీరు, నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ విధుల్లో వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసే విధంగా ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచాలని సీపీ సూచించారు. వాహనాల నిర్వహణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.వాహనాల్లో ఏర్పాటు చేసిన సమాచార ప్రసార పరికరాలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును కూడా సీపీ పరిశీలించారు. అత్యవసర సమయంలో అధికారులు, సిబ్బంది మధ్య సమాచార ప్రసారం వేగంగా జరిగేలా కమ్యూనికేషన్ పరికరాలు నిరంతరం పనిచేసే స్థితిలో ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే అవసరమైన సామగ్రి తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని సీపీ ఆదేశించారు.ప్రతి వాహనంలో ప్రథమ చికిత్స పెట్టె, మైక్ సిస్టమ్, అత్యవసర లైట్లు, తాళ్లు,ట్రాఫిక్ కోన్లు, నేరస్థల రక్షణ రిబ్బన్లు,హెల్మెట్లు, లాఠీలు,శరీర రక్షణ కవచాలు, ప్రతిఫలించే భద్రతా జాకెట్లు తదితర అత్యవసర,రక్షణ సామగ్రి అందుబాటులో ఉండాలని తెలిపారు.
అదేవిధంగా,ప్రతి వాహనంలో అవసరమైన రైట్ గేర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

*వాహనాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ*

వాహనాల నిర్వహణలో ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి,వెంటనే సరిదిద్దాలని సీపీ సూచించారు.నిర్ణీత వ్యవధిలో వాహనాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, ఇంజిన్ ఆయిల్ మార్పు,టైర్ల పరిస్థితి, బ్రేకులు,లైట్లు, బ్యాటరీ,ఇతర యాంత్రిక పరికరాల పనితీరు వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు.
వాహనాల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని,చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

*ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు*

వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచుతూ,వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న డ్రైవర్లను గుర్తించాలని సీపీ తెలిపారు.వాహనాల నిర్వహణ, డ్రైవింగ్‌లో క్రమశిక్షణ,బాధ్యత, అప్రమత్తత,వాహన సంరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమంగా పనిచేస్తున్న ఐదుగురు డ్రైవర్లను గుర్తించి ప్రోత్సాహకంగా పురస్కారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ వాహనాలు ఎల్లప్పుడూ అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండేలా అధికారులు, డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *