వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి వేంకటేశ్వర టాకీస్ రోడ్, మార్కెట్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి దుకాణాన్ని సందర్శించి వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి, ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, రంగ శ్రీశైలం, అమిరిశెట్టి రాజ్ కుమార్, కార్పొరేటర్బోట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బేర సత్యనారాయణ, ఆకుల అశోక్ వర్ధన్, సత్రం రమేష్, కుర్రె చక్రవర్తి, కమలాకర్ రావు, బియ్యాల సతీష్ రావు, రాకేష్ రెన్వ, వైద్య శ్రీధర్, జయరామ రావు, రాకేష్ రెన్వ, నాంపల్లి శ్రీనివాస్, అవిడపు రాజబాబు, బుద్దారపు రాజమౌళి మరియు తదితరులు పాల్గొన్నారు.





