ప్రాంతీయం

ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి – జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

4 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల :
వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి పి.పి.సి. హెచ్‌ ఓ డి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పి సి ఎస్ ఎ పి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయడంతో పాటు, నిర్దేశించిన 16 ప్రశ్నలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ,డి.పి.ఎం., మెప్మా పి.డి., ఇన్చార్జి జిల్లా సహకార అధికారి, డి.సి.ఎం.ఎస్. మేనేజర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *