మంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా CMRF మరియు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తెలుగు న్యూస్ మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో గల ZPSS ప్రభుత్వ పాఠశాలలో లక్షెట్టిపేట్ మరియు దండేపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) మరియు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
CMRF చెక్కులు: 157 మంది లబ్ధిదారులకు రూ.56,56,150 విలువైన చెక్కులు అందజేశారు. కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్: 67 మంది లబ్ధిదారులకు రూ.67,07,772 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 3,388 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు మరియు 3,850 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తామని తెలిపారు.ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుండగా, ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల కష్టాల్లో తోడుగా.. ప్రతి కుటుంబానికి అండగా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ లు చల్లా నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కో ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు..





