నూతన బిజెపి సర్పంచులను సన్మానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
మంచిర్యాల జిల్లా.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఇటీవల మంచిర్యాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి రవి ని, వెల్గనూర్ సర్పంచ్ మోరుపుటాల మానస తులసి ని, నాగ సముద్రం సర్పంచ్ నందుర్క సుగుణ ని, నంబాల సర్పంచ్ గోపే రాజమల్లు ని, లక్ష్మీపూర్ సర్పంచ్ సురమల్ల సౌజన్య ని సన్మానించి అభినందించడం జరిగింది. మరియు బిజెపి మద్దతుతో గెలిచి నంబాల ఉప సర్పంచ్ గా ఎన్నికైన బుద్దే వెంకటేష్ కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.





